ఘట్టమనేని ఫ్యామిలిలో మహేష్ సోదరుడి కుమారుడు ఫోటోలు వైరల్..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మధ్య ఉండే అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇద్దరు కూడా బ్రదర్స్ కంటే మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని తన అన్నయ్యతో పంచుకొనే వాడని తండ్రితో చెప్పలేని ఎన్నో విషయాలు కూడా తన సోదరుడికి చెప్పేవాడని ఎన్నో సందర్భాలలో మహేష్ బాబు తెలియజేశారు. తనకి సోదరుడు గాకంటే ఒక స్నేహితుడుగా బాగా సహకారం అందించే వారిని మహేష్ బాబు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు.

ఇక దీంతో రమేష్ పైన తనకున్న అభిమానం ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు మహేష్ బాబు. ఇక కళ్ళ ముందు అభిమానులు ఉండడంతో పలు విషయాలను చెప్పలేక ఎమోషనల్ కు గురయ్యారు. తన అన్నయ్య హీరో కాలేకపోయారు కనీసం ఒక పెద్ద నిర్మాతగా అయిన చూడాలని తను చాలాసార్లు ఆశపడ్డాను అని మహేష్ బాబు తెలిపారు. రమేష్ బాబు సినిమా చేస్తానంటే అన్ని చిత్రాలు పక్కనపెట్టి అతనితోనే సినిమా చేస్తానని తెలియజేశారు కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని చాలా బాధపడ్డాడు.
ఈ ప్రేమని రమేష్ బాబు తనయుడు అయిన ఘట్టమనేని జయకృష్ణపై చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నది తాజాగా జయకృష్ణ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. జయకృష్ణ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ సేమ్ టు సేమ్ ఉన్నట్లుగా ఈ ఫోటో చూస్తే మనకి అర్థమవుతుంది. ఇద్దరు ముఖాలు ఒకేలా ఉన్నాయి ఒకే రంగు సొంత అన్నదమ్ముల కనిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. క్యాజువల్ డ్రెస్సులు దిగిన జయకృష్ణ ఫోటో ఇది ప్రస్తుతం జై కృష్ణ వయసు 20 సంవత్సరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: