నాని 'దసరా' లో పూర్ణ.. ఈసారి ఊహించని పాత్రలో..?

Anilkumar
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసర. ఇక ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.అయితే నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే  తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ పూర్ణ కూడా నటిస్తుందని తెలుస్తుంది.ఇదిలావుండగా సినిమాలో పూర్ణ పాత్ర నెగటివ్ గా ఉంటుందని తెలుస్తుంది. 

ఇక ఈమధ్యనే బాలకృష్ణ అఖండ సినిమాలో నటించిన పూర్ణ ఆ సినిమాతో మెప్పించింది. ఇకపోతే ఒకప్పుడు సోలో హీరోయిన్ గా చేసిన అమ్మడు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కి సై అనేస్తుంది. అయితే నాని దసరా సినిమాలో పూర్ణ రోల్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.కాగా  సినిమాలో నాని ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలిసిందే. పోతే ఇప్పటికే ప్రచార చిత్రాలతో దసరా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇదిలావుంటే శ్యామ్ సింగ రాయ్ హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన అంటే సుందరానికీ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

ఇక  ఈ క్రమంలో నాని దసరా సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఇకపోతే  నాని, కీర్తి సురేష్ ల నటన ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.అయితే  నూతన దర్శకుడే అయినా శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఇక  సినిమాలో నాని పాత్ర అదిరిపోతుందని చెబుతున్నారు. కాగా నాని ఈ మూవీతో పక్కా మాస్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని అంటున్నారు. ఇదిలావుండగా ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే  ఇక సినిమా అనుకున్న విధంగా దసరాకి రిలీజ్ అవడం కష్టమే అని టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: