థాంక్యూ : మహేష్ ని ఫాలో అవుతున్న చైతూ?

Purushottham Vinay
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ల నుంచి వస్తున్న మరో సినిమా  థాంక్యూ.ఇక ఈ సినిమా ఎల్లుండి అనగా జులై 22 వ తేదీన విడుదల అవుతుంది.ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో పాటు తమిళనాడులో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా లాగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు.రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు.అయితే ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈ సినిమాపై సో సో గానే అంచనాలు ఉన్నాయి. గట్టిగా మౌత్ టాక్ వచ్చినా కూడా జనం వస్తారో లేదో అనే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ కూడా ఇప్పుడు బయటకి వచ్చింది.అనుకున్నట్టుగానే ఈ సినిమాని థాంక్యూ చిత్ర బృందం చిన్న సినిమాగానే సెట్ చేశారు. ఇక ఈ సినిమా కేవలం రెండు గంటల 9 నిముషాలు మాత్రమే ఉంటుందని సెన్సార్ సెర్టిఫికెట్ లో కనిపించింది. అలాగే యూ/ఏ గా దీన్ని నిర్ధారించారు. మరి ఇక ఇది అయితే చాలా తక్కువ నిడివే అని చెప్పాలి.యాడ్స్ టైటిల్స్ కనుక తీసేస్తే సుమారు 2 గంటలు రావచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో ఎల్లుండి చూడాలి.


ఇంకా ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా యస్ యస్ థమన్ సంగీతం ఇచ్చాడు. ఇంకా అలాగే దిల్ రాజు నిర్మాణం అందించారు.ఇప్పుడు మన తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికి కూడా తెలిసిందే. గత జూన్ లో కొన్ని హిట్స్ తర్వాత మళ్ళీ ఏ సినిమాకి కూడా కంప్లీట్ వసూళ్లు అనేవి రాలేదు. టాలీవుడ్ యంగ్ హీరో నాని నటించిన అంటే సుందరానికి సినిమాకి మాత్రం ఒక 80 శాతం మేర వసూళ్లు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలిపారు.ఇక ఈ చిత్రం తర్వాత వచ్చిన సినిమాలు పరిస్థితి కూడా మరింత దారుణం అని చెప్పాలి. తాజాగా వచ్చిన రామ్ మాస్ సినిమా “ది వారియర్” కండిషన్ అయితే ఇంకా దారుణంగా ఉంది. దీనికి అయితే ఎలా లేదన్నా సగం నష్టాలు తప్పవని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రం అనంతరం బాక్సాఫీస్ దగ్గర అదృష్టం పరీక్షించుకోడానికి వస్తుంది “థాంక్ యూ” చిత్రం. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: