'దూత' వెబ్ సిరీస్ విడుదలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చిన నాగ చైతన్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా థాంక్యూ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా , విక్రమ్ కె కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాశి కన్నా ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కథానాయికగా నటించింది.

ఈ మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో  ప్రస్తుతం థాంక్యూ మూవీ యూనిట్ అనేక టీవీ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే థాంక్యూ మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగ చైతన్య తాను ప్రస్తుతం నడుస్తున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నటిస్తున్న దూత వెబ్ సిరీస్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ చైతన్య మాట్లాడుతూ ... దూత అనే సూపర్ నాచురల్ వెబ్ సిరీస్ లో తనకు హీరోయిన్ ఉండదు అని ,  విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ ని ఆకట్టుకునే కథ, కథనాలతో  ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ,  దూత వెబ్ సిరీస్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లో  టోటల్ గా కంప్లీట్ కానుండగా ,  వచ్చే సంవత్సరం జనవరి తరువాత దూత వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానున్నట్లు తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న దూత వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన  అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: