పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈయన  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాలపై దృష్టి పెడుతూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా..పాలిటిక్స్ లోకి వచ్చి 'జనసేన' పార్టీని స్థాపించిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు పవన్ వ్యక్తిగత జీవితంపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇదిలావుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల కారణంగా చాలా సందర్భాలలో టార్గెట్ చేయబడ్డాడు. ఇక ఇప్పటికీ ఈ విషయం మీద జనసేన కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు వ్యతిరేక వర్గాన్ని ఎదుర్కివాల్సి వస్తోంది. 

అయితే ఇక  ఇప్పుడు లేటెస్టుగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో పవన్ వివాహాలపై చెప్పిన జోస్యం ట్రోలర్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా చేసింది.ఇకపోతే వేణు స్వామి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జాతకంలో నాలుగో పెళ్లి కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అక్కడితో ఆగకుండా అన్నయ్య చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని జోస్యం చెప్పారు.ఇదిలావుంటే ''పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు సంబంధం లేదు.

ఇక  అది జాతకం ప్రకారం జరుగుతుంది.అయితే  ఆయన ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకున్నా అది భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారం. ఇక పార్టీ లీడర్ అయినంత మాత్రాన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు'' అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.ఇదిలావుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు వేణు స్వామిని ట్రోల్ చేస్తున్నారు.ఇక  తన పాపులారిటీ కోసం జాతకం పేరుతో ఇలా పెళ్లిళ్ల గురించి జోస్యం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.అయితే  కేవలం తన వీడియోలకు వ్యూస్ పెంచుకోడానికే ఆయన ఇలాంటి కామెంట్స్ చేసారని విమర్శిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: