మెగాస్టార్ పనైపోయిందా? అందుకే ఈ సపోర్టా?

Purushottham Vinay
మెగా స్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువ మల్టీ స్టారర్లు చేయలేదు. అయితే దానికి కొన్ని రీజన్ ఉన్నాయి. చిరంజీవి చేసిన 150 సినిమాల లిస్టులో చాలా అరుదుగా మల్టీ స్టారర్స్ కనిపిస్తాయి.అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రూటు మార్చాడని, చేస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు ఇతర హీరోల సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మెగా స్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ముంబైలో చిరంజీవి-సల్మాన్ ఖాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా తీశారు. ఇంకా అలాగే కొంత షూట్ ఉందని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ ని కూడా పెట్టబోతున్నారు మూవీ మేకర్స్. యస్ యస్ తమన్ ఓ సాంగ్ కూడా రెడీ చేసి రికార్డింగ్ కూడా ఫినిష్ చేశాడు.ఇక అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ రోల్ లో కనిపించనున్నాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా కనిపించిన రవితేజ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు.


ఇటివలే రవి తేజ షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. అయితే రవితేజ ఎంట్రీతో సినిమాకు మంచి బజ్ అనేది వచ్చింది. అన్నయ్య టైంలో రవితేజ కి పెద్దగా హీరోగా ఇమేజ్ లేదు. రవి తేజ కేరెక్టర్స్ చేస్తూ బండి లాగిస్తున్న టైం అది. కానీ ఇప్పుడు లెక్క పూర్తిగా మారింది. రవితేజ కి ఇప్పుడు ఓ సెపరేట్ ఇమేజ్ తో పాటు మార్కెట్ ఉంది. కోవిడ్ 19 లాక్ డౌన్ తర్వాత ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ కి రవితేజ కచ్చితంగా హెల్ప్ అవుతాడు.ఇలా చేస్తున్న రెండు సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోలతో చిరు కలిసి పనిచేయడాన్ని యాంటీ ఫ్యాన్స్ అయితే సపోర్ట్ గా భావిస్తున్నారు. మెగా ఇమేజ్ తో కలెక్షన్స్ రావడం చాలా కష్టమని భావిస్తూ ఇలా ఇతర హీరోల సపోర్ట్ తో చిరు సినిమాలు చేసి మార్కెట్ రీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సల్మాన్ ఇంకా రవితేజ సపోర్ట్ తో చిరు ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటారో ? ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే చిరుకి దక్కే క్రెడిట్ ఎంత ఉంటుందో అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: