పవిత్ర లోకేష్- నరేష్ బంధంపై.. హైపర్ ఆది కామెంట్?

praveen
పవిత్ర లోకేష్ , వి కె నరేష్ వీరిద్దరూ కూడా మంచి నటులు. గత కొంతకాలం నుంచి మాత్రం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల విషయంలో కాదు.. వీరిద్దరి మధ్య పుట్టినా ఘాటు లేటు ప్రేమ విషయంలో.. గత కొంతకాలం నుంచి వీరిద్దరి లివ్ ఇన్ రిలేషన్ షిప్ కాస్త సోషల్ మీడియాలో పెద్ద గా మారిపోయింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం వీరిద్దరూ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం  మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదే అంశం పై స్పందించిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ మర్యాదలు పొగుడుతున్నారు అంటూ నరేష్ పై ఫైర్ అయినట్లు కూడా టాక్.

 ఇక పోతే ఇక పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంపై ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ ఉండగా తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా వీరి వ్యవహారం పై స్పందించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించి ప్రస్తుతం బుల్లి తెర నుండి వెండితెరకు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు హైపర్ ఆది. ఇక ఇప్పుడు ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు స్క్రిప్టు అందించడమే కాదు అందులో ముఖ్యమైన కమెడియన్గా కూడా కొనసాగుతూ తన పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు హైపర్ ఆది మ్ ఇక ఇటీవలే పవిత్ర లోకేష్ నరేష్ లపై ఆది చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

 అయితే హైపర్ ఆది డైరెక్టుగా వీరి రిలేషన్ షిప్ పై ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తనదైన శైలిలో సెటైరికల్ గా ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రసారం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ షో లో నరేష్ గురించి చర్చ రావడంతో పవిత్ర ముందుకు వస్తుంది. నరేష్ కు నేను ఉన్నాను అంటూ పవిత్ర చెప్పగా.. ఆది నీ పేరేంటి అని అడుగుతాడు. పవిత్ర అని సమాధానం చెబుతుంది లేడి కమెడియన్. ఇక ఆ తర్వాత వాడి పేరేంటి అని అడుగగా నరేష్ అంటూ చెబుతాడూ. తర్వాత హైపర్ ఆది సైలెంట్ అయిపోయాడు. వెంటనే అక్కడికి వచ్చిన పంచ్ ప్రసాద్ పవిత్ర లోకేష్ గురించి హైపర్ ఆది కామెంట్ చేశాడు అని క్లారిటీ ఇచ్చాడు.. ఇలా హైపర్ ఆది ఇండైరెక్టుగా పవిత్ర లోకేష్ నరేష్ బంధం పై కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: