అన్నయ్య మెగాస్టార్ వల్ల బ్రతికాను : కృష్ణ వంశీ

Purushottham Vinay
ఇక మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ను కనుక పరిశీలిస్తే ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. తన తోటి నటీనటులతోను ఇంకా దర్శక నిర్మాతలతోను ఆయన ఎంతో అభిమానంతో ఉంటారు.అందువలన అందరూ కూడా ఆయనను మరింత ఇష్టపడుతూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ చిరంజీవిని గురించి ప్రస్తావించారు. ఆయన చిరంజీవితో ఒక్క సినిమా చేయలేదుగానీ ..రామ్ చరణ్ తో మాత్రం 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేశారు. ఆ సినిమా హిట్ అయ్యి కృష్ణవంశీ మార్క్ మూవీ అనిపించుకుంది.ఇక కృష్ణవంశీ మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఆయన ఎదిగిన తీరు అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ..ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. ఇక నేను ఆయనను 'అన్నయ్యా' అని పిలిచేవాడిని. ఒకసారి ఆయనతో నేను ఒక యాడ్ చేశాను. "ఇక మీకు నచ్చినవారికి మీరు కారు గిఫ్టుగా ఇస్తారటగదా అన్నయ్యా .. ?" అని నేను చిరంజీవిగారితో అన్నాను. ఆ మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి కాల్ వస్తే  నేను వెళ్లాను. ఆయన నాకు కారు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు చెప్పడంతో చాలా ఆశ్చర్యపోయాను."నేను మాట వరసకి ఆ ప్రస్తావన తెచ్చాను .. నాకు ఇవ్వాలని కాదన్నయ్యా" అంటూ నేను అది తీసుకోలేదు.


 "నన్ను అన్నయ్యా అంటున్నావు .. నేను ఇస్తే తీసుకోకూడదా? అంటూ ఆయన ఆ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఎంతో అభిమానించే హీరో ఇంకా ఇండస్ట్రీ మొత్తం గర్వంగా చెప్పుకునే మెగాస్టార్ నుంచి స్వయంగా కారును అందుకుంటానని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవిగారు ఇవ్వడం వలన ఆ కారును అయితే మరింత అపురూపంగా చూసుకునేవాడిని.ఆ తరువాత ఒకసారి నేను నా వ్యక్తిగత పనుల నిమిత్తం 'నందిగామ' వెళ్లి వస్తుండగా నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ కారులో ఉన్న నాకు అసలు ఏమీ కాలేదు. ఆ కారులో ఉన్న ప్రత్యేకతల కారణంగానే అంత ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఆ గిఫ్ట్ .. అన్నయ్య ఆశీస్సు లాంటిది .. అదే నన్ను కాపాడేసింది అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ తాజా చిత్రమైన 'రంగమార్తాండ' సినిమా త్వరలో విడుదలకానున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: