మూడో బిడ్డకు జన్మనివ్వనున్న బాలివుడ్ బ్యూటీ..

Satvika
బాలివుడ్ లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆలస్యం..ఒకసారి పెళ్ళి చేసుకున్నాక వాళ్ళు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు..పెళ్ళయిన వెంటనే పిల్లల కోసం ప్లాను చేస్తున్నారు.అలా చాలా మంది ఉన్నారు.. అందులో కరీనా కపూర్, అనుష్క శర్మ, సొనమ్ కపూర్,తదితరులు.. అయితే కరీనా కపూర్ మాత్రం చాలా వరకూ సినిమాలను తగ్గించింది..కేవలం యాడ్ లు చేస్తూ బిజిగా ఉంది.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయింది ఈ చిన్నది. ఆ కెరీర్ పీక్ లో ఉండగానే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పేమించి పెళ్లాడింది. తన కంటే చాలా ఏళ్ళు పెద్దవాడైన సైఫ్ తో కరీనా ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ గా అయిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ కరీనాకు ఇప్పటికే ఇద్దరు కుమారులు రీసెంట్ గానే రెండో బిడ్డకు జన్మనించింది కరీనా. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు ఈ బ్యూటీ. వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరీనాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

ముచ్చటగా మూడో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో గర్భం దాల్చిన సమయంలో కరీనా సినిమాలు, యాడ్ లకు కూడా హాజరయ్యింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించింది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. మరి ఈ ప్రమోషన్స్ లో కరీనా పాల్గొంటుందో లేదో చూడాలి...ఈ విషయం పై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: