'పొన్నియన్ సెల్వన్' డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి మోస్ట్ ప్రాస్టిజిస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులోని మొదటి  భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ భారీ బడ్జెట్ మోస్ట్ ప్రాస్టిజిస్ కు ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం దర్శకత్వం వహిస్తూ  ఉండగా , ఈ మూవీ లో హేమా హేమీ నటీనటులు అయినా చియన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ , త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ టీజర్ ద్వారా మూవీ లో భారీ విజువల్స్ భారీ యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నట్లు చిత్ర బృందం చిన్న హింట్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ అన్ని భాషల డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారీ మొత్తం వెచ్చించి ఈ మూవీ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: