ట్రైలర్: రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ అదరగొడుతున్న రవితేజ..!!

Divya
హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాని డైరెక్టర్ శరత్ మండువ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ దివ్యంక కౌశిక్ రజిష విజయన్ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు కూడా చాలా వేగవంతం చేశారు చిత్ర బృందం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పలు ప్రమోషన్ కు మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ రోజున సాయంత్రం సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశారు.

ఒక ఆపరేషన్లో వేరు వేరు ప్రాంతాలకు చెందిన కొంతమంది కష్టజీవులు మాయమవుతూ ఉంటారని చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో రవితేజ ప్రజల కోసం నిలబడే నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా నటించడం జరిగింది. ఇక ఇందులో రవితేజ చెప్పే డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి. దీంతో రవితేజ అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రవితేజ పోషించిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఈ సినిమాలో చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మరొక హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లతో కూడా రవితేజ లవ్ ట్రాక్ బాగానే ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్లు చూపించిన విధంగా రవితేజ తీసుకుని నిర్ణయం వల్ల తమ ఫ్యామిలీ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో నాజర్, సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ తనికెళ్ల భరణి రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా రవితేజ కూడా ఉన్నారు ప్రస్తుతం మీరు ట్రైలర్ వైరల్ గా మారుతుంది ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: