టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతడే..!!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో ఎవరనే విషయంపై ఎప్పుడూ కూడా ప్రేక్షకులలో భిన్నా భిప్రాయాలు ఉండనే ఉంటాయి. అందరూ హీరోలకు సమాన స్థాయిలో అభిమానులు ఉన్నప్పటికీ మా హీరో నెంబర్ వన్ అంటూ మా హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో వాదనలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ నెలకు సంబంధించి టాప్ హీరో ఎవరనే విషయం ఇప్పుడు చాలా ట్రెండీగా మారుతోంది వాటి గురించి చూద్దాం.

ఈసారి టాప్ లో హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. తాను నటించిన రాధే శ్యామ్, సాహో సినిమాలు కూడా భారీ డిజాస్టర్ ని చవిచూశాయి. దీంతో ఈ సినిమాలు సైతం అటు సిని ప్రేక్షకులను అభిమానులను కూడా నిరాశపరిచాయి. కానీ సినిమాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచడం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు నిదర్శనమని కామెంట్లు తెలుపుతున్నాయి. ప్రభాస్ తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈసారి మూడవ స్థానంలో ఉన్నారు.
ఇక నాలుగవ స్థానంలో మహేష్ బాబు ఉండగా ఐదవ స్థానంలో చరణ్ ఉన్నారు ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఈసారి నిలవడం జరిగింది. ఏడవ స్థానంలో మాత్రం హీరో నేచురల్ స్టార్ నాని ఉండడం గమనార్హం. చిరంజీవి లాంటి వారు మాత్రం ఎనిమిదో స్థానంలో ఈసారి సరిపెట్టుకున్నారు. ఇక తొమ్మిదవ స్థానంలో విజయ్ దేవరకొండ ఉండగా పదవ స్థానంలో ఎప్పటిలాగానే రవితేజ ఉన్నారు. అయితే ఈ జూన్ నెలలో మాత్రం ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. మరి వచ్చే నెలలో ఏ హీరో మొదటి స్థానంలో ఉంటారు తెలియాలి అంటే మరో నెల ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: