మరోసారి అడ్డంగా బుక్కయిన నరేష్, పవిత్ర..!!

Satvika
టాలివుడ్ లో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. నరేష్, పవిత్రలు పెళ్ళి చేసుకున్నారా? వారిద్దరి మధ్య వున్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఇక వీరి మధ్య సంబంధం గురించి కూడా మీడియాలో కూడా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఆ మధ్య వీళ్లిద్దరు మైసూర్ వెళ్లినపుడు నరేష్ మూడో భార్య పవిత్ర లోకేష్ పై దాడి చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.నరేష్, పవిత్ర లోకేష్ కూడా తామిద్దరం పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే నరేష్ మూడో భార్య విడాకులకు ససేమిరా అనడంతో వీళ్లిద్దరి పెళ్లికి బ్రేకులు పడ్డాయి.

ఇక వీళ్లిద్దరు కలిసి పండితుల దగ్గర జాతకాలు చూపించుకున్నారట. ఇక పండితులు కూడా ప్రస్తుతం వీళ్లిద్దరు గ్రహ స్థితిని చూసి వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారట..నరేష్ కూడా తన మూడో భార్యకు డ్రైవరుతో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో నరేష్, పవిత్ర లోకేష్‌ల పెళ్లి వ్యవహారం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇక ఈయన ముగ్గురు భార్యలలకు ముగ్గురు పిల్లలున్నారు. మైసూర్ హోటలో జరిగిన సంఘటన తర్వాత నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు వేర్వేరుగా ఒక వీడియో విడుదల చేసారు. తమను నరేష్ మూడో భార్య వేధిస్తోన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇద్దరు ఒక గదిలో ఉండి వేర్వేరు వీడియోలు పంపించినట్టు నెటిజన్లు కూడా వీళ్లిద్దరిని ఓ ఆట ఆడుకున్నారు...

పవిత్ర లోకేష్ ప్రస్తుత భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా కన్నడ కూడా నటుడే. ఈమె ముందుగా ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో మనస్పర్ధల కారణంగా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్ తో సహ జీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు నరేష్‌కు దగ్గరైంది. ఇక రెండో భర్త సుచీంద్రతో అధికారికంగా మాత్రం పెళ్లి చేసుకోలేదు. అతను మాత్రం తన భార్య పవిత్ర లోకేష్ ను నరేష్ ఏదో మాయ చేసాడంటూ చెప్పుకొస్తున్నారు. ఈ వ్యవహారం చర్చలకు దారి తీయడంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఆమెను పక్కన పెట్టారు.తమపై మీడియా ఇంత ఫోకస్ పెడుతున్న అవేమి పట్టించుకోకుండా వీళ్లిద్దరు ఇప్పటికీ జంటగానే అన్ని వేడుకలకు హాజరవుతున్నారు. ఒకవేళ కోర్టు మూడో భార్యతో విడాకులు మంజూరు చేస్తే వెంటనే పవిత్ర లోకేష్‌ను అధికారికంగా నాల్గో మ్యారేజ్ చేసుకుంటాని చెబుతున్నారు..ఇది పెళ్ళివరకు వెళుతూందా లేదా అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: