ఇందిరా గాంధీ లుక్ లో అదరగొడుతున్న స్టార్ హీరోయిన్..!!

Divya
బాలీవుడ్ క్విన్ కంగాన రనౌత్ సినిమాలలో పలు ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. హీరోలతో రొమాంటిక్ పాత్రలు చేస్తూనే మరొకవైపు స్టార్ చిత్రాలలో నటిస్తూ యుద్ధ సన్నివేశాలు చేయగలదు. కెరియర్ ప్రారంభం అయ్యి రెండు దశాబ్దాలకు చేరువలో ఉన్నది ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించింది. వాటిలో కొన్ని చిత్రాలు, పాత్రలు కంగనారనోత్ కు బాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచేలా చేశాయి. అందుచేతనే అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో క్వీన్ గా పేరు పొందింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక ఛాలెంజింగ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది కంకణ రనాథ్.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధాన పాత్రలో కంగాన రనౌత్ నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా కోసం స్వయంగా కంగానానే కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఈ చిత్రానికి దర్శకురాలుగా కూడా ఈమెనే ఉన్నది. ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగానారనోత్ ఒదిగిపోయేలా కనిపిస్తున్నది. అచ్చం ఇందిరా గాంధీకి అచ్చుగుద్దినట్లుగానే ఈ ఫోటోలో కనిపిస్తున్నది. ముఖానికి మేకప్ గుండ్రని కళ్ళు పెద్ద చెవులు ఇలా అన్ని యాజ్ టీజ్ జిరాక్స్ కాపీల ఉన్నాయి.
టీజర్ చివర్లో ఇందిరాగాంధీని అంత సార్ అని పిలుస్తారని అమెరికా అధ్యక్షుడు తెలుపుతూ ఉంటారు. ఈ డైలాగ్ చాలా హైలైట్ గా కనిపిస్తోంది ఎమర్జెన్సీ చాలా పవర్ఫుల్ కంటెంట్తో తెరకెక్కించడం జరిగింది. 1975లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో దేశంలో విధించిన ఒక ఎమర్జెన్సీ సినిమాలు హైలైట్ గా చూపించడం జరుగుతుంది ఆ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశాన్ని ఎలా కాపాడుకోవాలో వంటి అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇందులో భూమిక చావ్లా అనుపంకేర్, తదితరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ వైర్లుగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: