కాళీ డైరెక్టర్ కు షాక్ ఇస్తున్న కోర్టు..!!

Divya
ఈ మధ్యకాలంలో పలు సినిమాలు పలు విధాలుగా తీయడంతో పలు వివాదాలు వాటి చుట్టూ చుట్టూ ముడుతున్నాయి. తాజాగా ఇప్పుడు కాళీ అనే ఒక సినిమా కూడా ఇప్పుడు పలు వివాదాలలో చిక్కుకుంది. ఎందుచేత అంటే కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఒక ఫోటోను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చకు దారితీసింది దర్శకురాలు లినా. ఇప్పుడు తాజాగా ఈమెకు ఎదురు దెబ్బ తగిలింది వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.

ఢిల్లీ హైకోర్టులో టూరింగ్ టాకీస్ అనే నిర్మాణ సంస్థను కూడా కోర్టుకు హాజరు కావాలి అని వాటితో పాటు దర్శకురాలు విచారణ ఇవ్వాలని కోర్టు కూడా ఆదేశించడం జరిగింది. ఆగస్టు 6 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో కూడా హాజరు కావాల్సిందే అన్నట్లుగా తెలియజేసింది కోర్టు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా కోర్టు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం మరింత చర్చనీ అంశంగా మారుతోంది. డైరెక్టర్ లీనా హాజరవుతుందా లేదా ఏం సమాధానం చెబుతారా అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠం రేపుతోంది.

ఇదంతా ఇలా ఉండగా డైరెక్టర్ లీనా వ్యవహారంపై పలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇమే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నది అన్నట్లుగా కొంతమంది సినీ ప్రముఖులు సైతం విమర్శిస్తున్నారు. కాళీమాత సిగరెట్ తాగుతున్నటువంటి ఒక ఫోటోను విడుదల చేయడంతో వివాదాస్పందమైన క్రమంలో తొలగించి ఉంటే సరిపోయేది అని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కొంతమంది నేటిజన్స్. ఇక అంతే కాకుండా హిందువులు కూడా తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చేయడంతో ఆ సంఘాలకు సారి చెప్పి ఉంటే ఆ సమస్య అప్పుడే ముగిసేదని అంటున్నారు. అలాకాకుండానే మరుసటి రోజు కూడా మరిన్ని ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ విషయం కాస్త కోర్టు దగ్గరకు వెళ్ళింది అని తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: