చంద్రబాబు పై పోటీ విషయంలో స్పందించిన విశాల్.. ఏమన్నాడంటే..?

Anilkumar
తమిళ స్టార్ హీరో విశాల్ అందరికీ సూపరిచితుడే .అయితే ఈయన  తెలుగువారు అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆయన తండ్రి చెన్నైలో సెటిల్ అయిన ఆంధ్ర వ్యక్తి. ఇక చిత్తూరుకు చెందిన ఈ ఫ్యామిలీ...ప్రస్తుతం చెన్నై లో సెటిల్ అయ్యారు. కాగా చెన్నైలో బిజినెస్ లు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. అయితే అయినా సరే వారికి ఏపీ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక అంతే కాకుండా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ తో కూడా విశాల్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. పోతే ఈ విషయం బహిరంగంగా వైఎస్ జగన్ ను పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇదిలావుంటే ఈ నేపథ్యంలో హీరో విశాల్ 2024 ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పై పోటీ చేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వైసిపి తరపున కుప్పం లో విశాల్ భరిలోకి దిగుతారు అనే వార్తలు గత కొద్ది రోజులు గా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇక  ఈ వార్తలు ఎక్కువ అవ్వడం తో విశాల్ స్పందించారు. కాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన విశాల్. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు..ఆయన ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నా అంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక అసలు ఈ వార్తలు ఎక్కడ పుట్టాయో కూడా అర్థం కావడంలేదు.

అంతేకాదు  నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నా నన్ను పోటిచేయమని కూడా ఎవరూ సంప్రదించలేదు. ఇకపోతే ప్రస్తుతం నాదృష్టి మొత్తం సినిమా ల పైనే ఉంది.అంతేకాక  ఏపి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కూడా నాకు లేదు.అని  విశాల్ ట్విట్టర్ లో లాంగ్ నోట్ రాశారు.అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విశాల్... గతంలో చెన్నైలో ఒ నియోజకవర్గం నుంచి స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.కాగా  లెక్షన్ లో ఓడిపోయినప్పటికీ.. విశాల్ కు ఓటింగ్ గట్టీగానే వచ్చింది. ఇక దాంతో ముందు ముందు రాజకీయాల్లోకి విశాల్ వస్తారన్న అభిప్రాయం అందరిలో బలంగా నాటుకుపోయింది.అంతేకాకుండా  ఆంధ్ర వ్యాక్తి కావడంతో ఆయన ఇక్కడ పాలిటిక్స్ ను కూడా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: