శ్రీ విష్ణు 'అల్లూరి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయినా శ్రీ విష్ణు గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ కెరియర్ ను ఫుల్ స్పీడ్ లో ముందుకు సాగిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే మెంటల్ మదిలో , నీది నాది ఒకే కథ , బ్రోచేవారెవరురా లాంటి మంచి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ విష్ణు గత కొద్ది కాలంగా బాక్సాఫీస్ దగ్గర విజయాలను ఆదుకోవడంలో చాలా వరకు స్లో అయ్యాడు. తాజాగా శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్ , అర్జున పల్గుణ , భళా తందనాన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాయి. అలా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నా శ్రీ విష్ణు తాజాగా అల్లూరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా అల్లూరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శ్రీ విష్ణు పోలీస్ యూనిఫాంలో ఉన్నాడు. అలాగే చేతులో గన్ పట్టుకొని పవర్ఫుల్ గా నిల్చొని ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అల్లూరి సినిమాకి  'నిజాయితీకి మారుపేరు' అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: