ప్రభాస్, అనుష్క.. కాంబో సెట్ అయినట్టే..!

Anilkumar
పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి చాలా సినిమాలే చేసారు.అయితే తాజాగా కలిసి మళ్లీ జోడీ కట్టబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.ఇకపోతే బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవగా ఆ సినిమా తర్వాత అనుష్క ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది.ఇక  నిశ్శబ్ధం తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క ఈమధ్యనే నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న సినిమాకు ఓకే చెప్పింది. కాగా అనుష్కకి అవకాశాలు ఇస్తామని వస్తున్నా సరే ఆమె సరైన కథల కోసం చూస్తుందని తెలుస్తుంది.

అయితే తాజాగా ఇప్పుడు అనుష్క మరోసారి ప్రభాస్ తో రొమాన్స్ కి రెడీ అవుతుందని టాక్. ఇక ప్రభాస్ సలార్ సెట్స్ మీద ఉంది. కాగా ఆ మూవీ తర్వాత ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలకు ముందు మారుతితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. పోతే రాజా డీలక్స్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఎలాగు యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమా వస్తుంది కాబట్టి ఈ మూవీకి అనుష్క నో చెప్పకపోవచ్చని టాక్.ఇకపోతే అదిగాక ప్రభాస్ తో జోడీ అంటే అనుష్క కూడా నో చెప్పదు. ఇక సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ జంటని మళ్లీ ఒకటి చేయాలని చూస్తున్నాడు మారుతి.

అయితే  ఇక సినిమా కథ కూడా రొమాంటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలావుంటే ఆడియెన్స్ కూడా ప్రభాస్, అనుష్క కలిసి సినిమా చేస్తే చూడాలని ఉత్సాహపడుతున్నారు.కాగా ఎలా చూసినా సరే ప్రభాస్, అనుష్క కలిసి నటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇకపోతే మారుతి సినిమాకు కేవలం రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చి ఆలోగా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.ఇక  ఆ తర్వాత ప్రాజెక్ట్ కె.. స్పిరిట్ రెండు భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి వాటి మీద పూర్తి ఫోకస్ చేయాల్సి ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: