ఆస్కార్స్ లో సూర్య.. సౌత్ ఇండియా హీరోగా న్యూ రికార్డ్!

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు ఇంకా అలాగే అభిమానులు ఎంతగానో ఎదురు చూసే పురస్కార వేడుక అంటే 'ఆస్కార్స్' అనే చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇచ్చే అవార్డు చాలా మంది ఎంతో గొప్పగా భావిస్తారు.ఇక ఆస్కార్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం కూడా చాలా గౌరవంగా భావిస్తారు. అటువంటి గౌరవం ఇక ఈ ఏడాది మన సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్యకు దక్కింది.ఆస్కార్స్ 2022... ఈ ఏడాదికి గాను పురస్కార వేడుక కమిటీలో మొత్తం 397 మందికి చోటు కల్పించడం జరిగింది. ఇక క్లాస్ ఆఫ్ 2022గా పిలవబడే ఈ కమిటీలో సూర్య శివకుమార్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఇంకా ఫిమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియాను రిప్రజెంట్ చేయనున్నారు.ఇంకా అలాగే తమిళ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్స్ కమిటీలో చోటు దక్కించుకున్న తొలి నటుడిగా సూర్య సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో ఆయన అభిమానులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు.


ఇక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. ఆ రెండు సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు లభించింది.దేశావ్యాప్తంగా కూడా ఆ సినిమాలకు గాను సూర్యాకి ఒక రేంజిలో ప్రశంసలు దక్కాయి.ఇక ప్రస్తుతం సూర్య చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నారు. జూలై 1 వ తేదీన విడుదల కానున్న 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'లో అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఇంకా అలాగే ఆయన హిట్ సినిమా 'ఆకాశమే నీ హద్దురా' హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతోంది. అందులో అతిథి పాత్ర చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: