'ఏజెంట్' మూవీకి అదే హైలెట్ అట..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా కెరీర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఏజెంట్ మూవీ నుండి విడుదల అయిన అఖిల్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ తో సాక్షి వైద్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ మూవీ లోని సాక్షి వైద్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా లోని ఇంటర్వెల్  సన్నివేశం ఈ సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది. ఈ మూవీ ఇంటర్వెల్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ వస్తుందట, ఈ ట్విస్ట్ ఈ సినిమాకి హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: