ఈ టైం లో అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడా..?

shami
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎనౌన్స్ చేసినా అది సెట్స్ మీద వెళ్లడానికి టైం పట్టేలా ఉంది. హరీష్ శంకర్ సినిమా కన్ ఫర్మ్ చేసి ఈలోగా 20 రోజుల్లో మరో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇదిలాఉంటే పవన్ తో సినిమాకు ఎలాగు టైం పట్టేలా ఉందని హరీష్ శంకర్ మరో హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
భవదీయుడు భగత్ సింగ్ కన్నా ముందే మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. అయితే హరీష్ శంకర్ లేటెస్త్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలిశాడు. దానితో బన్నీతో హరీష్ శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. పుష్ప 2 కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్ ఆ సినిమా పూర్తి చేశాక నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఫిక్స్ చేసుకోలేదు. అది హరీష్ శంకర్ డైరక్షన్ లోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే దువ్వాడ జగన్నాథం సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ని కలవగా అదేదో సినిమా కోసం కలిసినట్టు వార్తలు రాస్తున్నారు.
హరీష్ శంకర్ అల్లు అర్జున్ డీజే కాంబో రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మరో ఎనర్జిటిక్ మూవీ వస్తుందని చెప్పొచ్చు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడు అన్నది ఇంకా డైలమాలోనే ఉంది. మరి ఆ సినిమా ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. బన్నీ మాత్రం ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ అయినా పాన్ ఇండియా కథతో వస్తే అల్లు అర్జున్ తప్పకుండా ఛాన్స్ ఇస్తాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: