బండ్ల గణేష్ పై మెగాస్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..?

Anilkumar
తాజాగా బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో పలు సినిమా ఈవెంట్లకు దూరమవుతున్నారు. ఇక బండ్ల గణేష్ సినిమా ఈవెంట్లకు హాజరయ్యి మైకు చేత పట్టారంటే ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో మన అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే తాజాగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇకపోతే ఈ క్రమంలోనే వేదిక పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఇదిలావుంటే పూరి జగన్నాథ్ కుమారుడు చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పూరి జగన్నాథ్ హాజరుకాలేదు. 

ఇక ఈయన ప్రస్తుతం జనగణమన సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు.అయితే  ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ ఉద్దేశిస్తూ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను పరిచయం చేశారు.అంతేకాక  డాన్స్ రానివారికి, డైలాగులు చెప్పడం రాని వారిని కూడా మెగాస్టార్ లను సూపర్ స్టార్ లను చేశారు కానీ ఈయన కొడుకు సినిమా కోసం రావడానికి తీరిక దొరకలేదు ఇది పూర్తిగా తప్పు అంటూ కామెంట్ చేశారు బండ్ల గణేష్.తాజాగా ఇప్పుడు ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ మహేష్ బాబు సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యలపై మహేష్ బాబు రామ్ చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరి ఈ విషయంపై బండ్లగణేష్ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: