రూమర్స్ పై స్పందించిన నరేష్...!!

murali krishna
కరోనా నుంచి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో సినీ కార్మికుల నుంచి గట్టిగానే షాక్ తగిలింది. వారంతా బంద్‌కి పిలుపునిచ్చారు.


గత కొంత కాలంగా తమ వేతనాలు పెంచాలని సినీ కార్మికులు ఫెడరేషన్‌పై ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయంలో ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికులంతా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈరోజు కార్మికులంతా కలిసి ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారట . దీంతో షూటింగ్ లు ఆగిపోయాయి.


దీనిపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కరోనా కారణంగా మూడేళ్లు సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని.. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతున్న సమయంలో సమ్మెబాట పట్టడం అస్సలు కరెక్ట్ కాదని అన్నారు. నిన్నటి నుంచి టీవీలన్నీ కూడా మారుమోగిపోతున్నాయని.. షూటింగ్ లు ఆగిపోతాయని టెలికాస్ట్ చేస్తున్నారని అన్నారట.ఒకట్రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు.. మంచిదే.. ఈ విషయంపై పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.


అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. గత మూడేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ అట్టడుకుపోయి.. కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా పూట గడవక ఇబ్బందులు పడ్డారు.. వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కాస్త వెంటిలేటర్ పై ప్రాణం పోసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని.. ఇండస్ట్రీకి కూడా మంచి పేరొస్తుందని ఆయన అన్నారు.


మనందరి బ్యాంక్ లు నిండకపోయినా.. కంచాలు నిందుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో అన్నింటికీ పరిష్కారం ఉంటుందని అన్నారు. నిన్నటి నుంచి తనకు చాలా ఫోన్లు వస్తున్నాయని.. మొత్తం మునిగిపోతామండి అంటూ దర్శకనిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారట.. కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోయారని.. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని.. ఇప్పుడిప్పుడే మెల్లగా స్థిరపడుతున్నారని చెప్పుకొచ్చారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: