వాకింగ్ కోసం రోడ్డు మీదకి వచ్చిన మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో..!

Anilkumar
తాజాగా సర్కారు వారి పాట సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు .ఇకపోతే  ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత మహేశ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ ట్రిప్ గట్టిగా వేశాడు.ఇదిలావుంటే తాజాగా మహేశ్ యూరప్‌లో రోడ్ ట్రిప్‌లో ఉన్నపుడు సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్‌, కూతురు సితారతో కలిసి సెల్పీ దిగి నెట్టింట్లో పోస్ట్ చేయగా ఇక అది ఫుల్ గా వైరల్ అయింది.ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రీగా తిరిగేస్తున్నారు.అంతేకాక  భార్య నమ్రతతో కలిసి రోడ్డుమీద వాకింగ్ చేస్తున్నారు. అయితే ఇంకేముంది ఫ్యాన్స్ చుట్టుముట్టి ఉంటారు కదా..

ఇక ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ల్యాండింగ్ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇక  ఈ సారి న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ లో బిజీగా ఉండే 5th Avenue వెంట నడుచుకుంటూ వెళ్లాడు మహేశ్‌. ఇకపోతే ఈ విజువల్స్ ను జావియర్ అగస్టీనా తన కెమెరాలో బంధించాడు. కాగా వీడియోను మహేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 5th Avenueలో షికారును మరేదీ అధిగమించలేదు..ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన క్రెడిట్‌ మళ్లీ నా స్నేహితుడైన జావియర్ అగస్టీనా కు వెళ్తుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.ఇక మహేశ్‌తోపాటు నమ్రతను కూడా వీడియోలో వాకింగ్ చేస్తూ సందడి చేసింది.

అయితే  అంతే కాదు ఈ వీడియో కింద తన వెర్షన్ లో కామెంట్ కూడా రాసింది నమ్రత. అయితే ఈవీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.కాగా  ఫ్యాన్స్ సూపర్ స్టరా్ ను చూసి దిల్ ఖుష్ అవుతున్నారు.ఇకపోతే  ఎలాగా మన దగ్గర ఇలా రోడ్డు మీద నడిచే అదృష్టం లేదు.. ఫారెన్ లో మాత్రం హాయిగా రోడ్డుమీద విహరిస్తున్నారు సెలబ్రిటీ కపుల్ మహేశ్ బాబు త్వరలో టూర్ ముగించుకుని ఇండియాకు తిరిగిరానున్నాడు. ఇదిలావుంటే ఇండియాకు వచ్చీ రావడంతో.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమా షూట్‌తో బిజీగా కానున్నాడు. అయితే ఇప్పటివరకున్న అప్‌డేట్ ప్రకారం జులైలో త్రివిక్రమ్‌-మహేశ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్‌.ఇక  ఇప్పటికే ఈ మూవీ ఓపెనింగ్ అయిపోయంది.అయితే  ఈసినిమా తరువాత రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు మహేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: