అనుష్క యోగా డే స్పెషల్ పోస్ట్ వైరల్..!!

Divya
అనుష్క సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె అదిగో ఇదిగో అంటూ వాయిదా మీద వాయిదా వేస్తూ తన కొత్త సినిమాలు ఆలస్యం చేస్తోంది. ఇక ఈమె నుండి చిత్రం ఎప్పుడు వస్తుందో తెలియక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈమె అభిమానులతో టచ్లో ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇక ఇతర హీరోయిన్ మాదిరిగా అనుష్క ఫోటోస్, స్కిన్ షో ఎప్పుడూ కూడా షేర్ చేయలేదు. ఇక కనీసం రెగ్యులర్ ఫోటోలను కూడా ఈమె ఎన్నడూ షేర్ చేయలేదు.

ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో కూడా పెద్దగా స్కిన్ షో చేసేందుకు ఆసక్తి చూపదు. అయితే తాజాగా ఈ రోజున ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. యోగ డే సందర్భంగా అనుష్క అందుకు సంబంధించిన విషయాలను తెలియజేయడం జరిగింది. సినిమాల్లోకి రాకముందు యోగా గురువుగా, ట్రైనర్ గా విధులు నిర్వహించిన అనుష్క ఆ తర్వాత యోగాను వీడకుండా ఉంటోంది. ఇక ఆమె అందం కు యోగానే ముఖ్యకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. యోగ డే సందర్భంగా తన యోగ గురువు అయిన భరత్ ఠాగూర్ ను గుర్తు చేసుకోవడం జరిగింది.
జనాలకు కొత్త మోటివేషన్ గా కొన్ని వాక్యాలు కూడా తెలియజేసింది. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడం కోసం ఎంతో నేర్చుకోవాలని.. ఎన్నిటినో అర్థం చేసుకోవాలని అంటూ తనదైన శైలిలో కాస్త బోధన చేసినట్లుగా పోస్ట్ చేసింది అనుష్క. అనుష్క యోగ డే రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అనుష్క తన సినిమాలకు సంబంధించి అప్ డేట్ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కూడా కోరుతున్నారు. కానీ ఆమె తెలియజేయక పోవడంతో రిటర్న్ కూడా ఈమెకు హ్యాపీ యోగ డే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: