వావ్! ప్రభాస్ ఖాతాలో ఇన్ని రికార్డులున్నాయా?

Purushottham Vinay
బాహుబలి ఇంకా బాహుబలి2 సినిమాలు ఒక విధంగా ప్రభాస్ రేంజ్ ను బాగా మార్చేశాయని చెప్పాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే టాక్ తో అసలు ఎలాంటి సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆయన అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో బాహుబలి సినిమా ఒకటనే సంగతి కూడా తెలిసిందే. బాహుబలి2 సినిమా సృష్టించిన సంచలన రికార్డులు అసలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డులు చాలా భాషల్లో కూడా ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో మొత్తం 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఇక ఈ సినిమా 9000 కంటే ఎక్కువ థియేటర్లలో అప్పట్లో విడుదలైంది.బాహుబలి2 సినిమాకు ముందు అసలు ఈ స్థాయిలో మరే సినిమా థియేటర్లలో విడుదల కాలేదు.ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్లు సాధించిన మరో సినిమా అసలు లేదని సమాచారం అందుతోంది.


ఇంకా అలాగే బుక్ మై షో వెబ్ సైట్లో రిలీజ్ కు ముందు నిమిషానికి 5 టికెట్ల చొప్పున బుకింగ్ అయిన సినిమాగా కూడా బాహుబలి2 నిలవడం గమనార్హం.ఇక ఈ సినిమా టికెట్లు 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు కూడా బ్లాక్ లో అమ్ముడవడం గమనార్హం. ఇంకా అలాగే టికెట్లు దొరకక అభిమానులు ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి బాగా సిద్ధపడ్డారు. అలాగే ఈ సినిమాకు 215 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కూడా వచ్చాయి.ఇక అన్ని రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్టైనా ఈ సినిమా కేరళలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు. ఈ సినిమా 50 రోజులు మొత్తం 1050 కేంద్రాలలో ఆడింది. ఈ రికార్డ్ భవిష్యత్తులో కూడా బ్రేక్ కావడం సాధ్యం కాదు. తెలుగులో ఈ సినిమాకు 510 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం.ఇక ఈ విధంగా ప్రభాస్ ఈ ఒక్క సినిమాతోనే 20 సినిమాలకి సరిపడా కళ్లు చెదిరే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: