ఒక్కో సినిమాకు రామ్ చరణ్ పారితోషకం అన్ని కోట్లా..?

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే . తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక తన రెండవ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన మగధీర సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఇక అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడంతో ఆరెంజ్ వంటి చిత్రాలతో భారీగా డిజాస్టర్ ను చవి చూడడం జరిగింది.
ఇక ఆ తర్వాత వచ్చిన ధ్రువ సినిమా తో మళ్ళీ మంచి ఫాంలోకి వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం సినిమా తో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చెవిటి అబ్బాయి గా రామ్ చరణ్ నటించి ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పవచ్చు.  ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రామ్ చరణ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసి పాన్ ఇండియా హీరోగా చలామణి అయ్యారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఆయన తన సమయాన్ని ఎక్కువ రోజులు కేటాయించినందుకు గాను ఏకంగా 45 కోట్ల రూపాయలను పారితోషకం గా తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇప్పుడు కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  #RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 60 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: