సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'చోర్ బజార్'..!

Pulgam Srinivas
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆకాష్ పూరి అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, సినిమాల్లో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆకాష్ పూరి 'రొమాంటిక్' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ రిజల్ట్ ను తెచ్చుకుంది. ఇలా రొమాంటిక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఆకాష్ పూరి తాజాగా చోర్ బజార్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి జార్జి రెడ్డి ఫెమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఈ మూవీ కి సురేష్ బెబ్బులి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే చోర్ బజార్ మూవీ ని ఈ నెల 24 వ తేదీన విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి చోర్ బజార్ సినిమా యూ/ఎ సర్టిఫికెట్ ను అందుకుంది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఐ వి ప్రొడక్షన్స్ వారు ఈ మూవీ ని నిర్మించగా , ఈ మూవీ ని ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. మరి రొమాంటిక్ మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఆకాష్ పూరి 'చోర్ బజార్'  మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: