ఎన్టీఅర్ సినిమా కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి..!!

P.Nishanth Kumar
ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలోని చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. జూలై నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి ఇంకొకవైపు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉండగా అక్కడి నుంచి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తుది చిత్ర యూనిట్. 

ఆర్ఆర్అర్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా హీరోగా అవతరించిన ఎన్టీఆర్ ఈ చిత్రం ద్వారా సోలోగా పాన్
ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకొని క్రేజ్ ను దక్కించుకోవాలని భావిస్తున్నాడు. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో ఈ మాస్ మసాలా సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటు కొరటాల శివ కూడా ఈ చిత్రం ద్వారా ఓ కొత్త రకమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేసిన సందేశాత్మక సినిమాల దారిలో కాకుండా పక్కా కమర్షియల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల పట్ల ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఒకవైపు పూజాహెగ్డే కూడా ఈ సినిమాలో నటించబోతుందని అంటున్నారు. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది ఎప్పుడు ఎన్టీఆర్ ను తెరమీద చూడాలి అన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక ను గమనించి కొరటాల శివ ఈ చిత్రాన్ని త్వరగా చేస్తాడా అనేది చూడాలి. ఆచార్య పరాభవం లో ఉన్న కొరటాల శివ ఈ సినిమా తో తిరిగి ఫామ్ లోక్ రావాలని చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: