ఆ సెంటిమెంట్ ప్రకారం 'RC15' బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!

Anilkumar
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే రామ్చరణ్ సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ఎప్పుడూ ఆయన్ను వెంటాడుతూనే ఉంది. అదేంటంటే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన వెంటనే అట్టర్ ఫ్లాప్ సినిమా రావడం ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. చరణ్ కు ఒక హిట్ పడితే వెంటనే ఒక ఫ్లాప్ పడుతుంది. అదే ఆయనకు సెంటిమెంట్గా మారుతు వస్తోంది. కెరీర్ ఆరంభంలో చూసుకుంటే మగధీర సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న తెలిసిందే.

ఆ వెంటనే వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరియర్ ఉన్నంతకాలం ఈ సినిమా ఒక భారీ డిజాస్టర్ అనే విషయం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసి సరికొత్త రామ్ చరణ్ పరిచయం చేసింది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశనే మిగిల్చి రామ్ చరణ్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల జక్కన్న దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది.

ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్ సి 15. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చరణ్ సెంటిమెంట్ హిట్ ఫ్లాప్.. హిట్ ఫ్లాప్.. ప్రకారం చూసుకుంటే కచ్చితంగా ఆర్ సి 15 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: