పుష్ప మాస్ ఎక్స్ ప్రెషన్ తో హన్సిక రీల్.. వైరల్!

Purushottham Vinay
దేశముదురు కథానాయిక హన్సిక మోత్వానీ ఫస్ట్ హీరో ఎవరంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని తెలిసిందే. దేశ ముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తెలుగు తమిళ భాషల్లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా ఆలస్యమైనా కానీ లేటెస్టుగా `పుష్ప`లోని అల్లు అర్జున్ పాటకు తన పాపులర్ ఎక్స్ ప్రెషన్ రీల్ ను షేర్ చేసింది.సౌత్ బ్యూటీగా పాపులరైన హన్సిక మోత్వాని తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ అంటే చాలు విపరీతంగా అభిమానిస్తుంది. ఇప్పటికీ బన్నీ అవకాశమిస్తే అతడి సరసన నటించేందుకు ఆసక్తిగా ఉంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఈ జోడీ తెలుగులో `దేశముదురు` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదంతా అటుంచితే బన్ని `పుష్ప` నుంచి మాసీ ఎక్స్ ప్రెషన్ ను ప్రదర్శించే రీల్ ను హన్సిక తాజాగా పోస్ట్ చేయగా అది బాగా వైరల్ గా మారింది. ఇక హన్సిక షేర్ చేసిన వీడియోని అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి రీపోస్ట్ చేశారు!అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప: ది రైజ్` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంని సాధించింది. ఈ మూవీ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ బెల్ట్ లో రూ. 100 కోట్ల మార్కును కూడా ఈ సినిమా నమోదు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.


అంతకుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ ని మరో లెవల్లో ప్లాన్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.ఇక హన్సిక కెరీర్ విషయానికి వస్తే...ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలలో నటిస్తోంది. కరోనా క్రైసిస్ వల్ల చాలా సినిమాల షూటింగ్లు అనేవి చాలా నెమ్మదిగా సాగాయి.ప్రస్తుతం అయితే పెండింగ్ చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. నార్త్ ఇండియాకి చెందిన హన్సిక అక్కడ మంచి చైల్డ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. కెరీర్ తొలినాళ్ళలో హన్సికకి యూత్ లో క్రేజ్ పీక్స్ లో ఉండేది.ఆ తరువాత హన్సిక కొంచెం బొద్దుగా అవ్వడం ప్లస్ వరుస ప్లాపులు ఇంకా కొత్త హీరోయిన్స్ పోటీ వల్ల సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: