రాధే శ్యామ్ : ప్రజాదరణ కోసం సరికొత్త ప్రమోషన్స్!

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల 'రాధే శ్యామ్' సినిమా వచ్చింది. ఇక మార్చి 11వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. యూవీ క్రియేషన్స్ ఇంకా టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.పూజా హెగ్డే కథానాయికగా అలరించిన ఈ సినిమా మొత్తం కూడా జాతకాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో హీరోకి జ్యోతిష్కుడుగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ఠలు ఉంటాయి. సినిమా ఆరంభంలోనే హీరో ఇందిరాగాంధీ చేయిచూస్తాడు.ఈ సినిమాలో హీరో చెప్పిన జాతకం ఎక్కడా కూడా తప్పదు ..కేవలం ఒక్క క్లైమాక్స్ లో తప్ప. అక్కడ మన జీవితం మన చేతి రేఖల్లో కాదు అది మన చేతల్లో ఉంటుందని దర్శకుడు చెబుతాడు. హీరోను జాతకాలు చెప్పేవాడిగా చూపించి చివరి వరకూ కూడా జాతకాలపై నమ్మకం కలిగిస్తూ వచ్చిన దర్శకుడు చివర్లో ఇలా తేల్చడంతో ఆడియన్స్ బాగా అయోమయానికి లోనయ్యారు. ఇక్కడ క్లారిటీ లోపించడమే సినిమా దెబ్బతినడానికి ప్రధానమైన కారణమైందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.అలాంటి ఇక ఈ సినిమాను ఆ తరువాత ఓటీటీలో కూడా వదిలారు. అయితే అక్కడ కూడా ఈ సినిమా అంతంత మాత్రం ఫలితాన్నే రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రసార హక్కులను ఇక జీ తెలుగువారు దక్కించుకున్నారు. ఇక ఈ నెల 26వ తేదీన ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కానుంది. దాంతో ఛానల్ వారు కూడా కొత్త ప్రచారానికి తెర తీశారు.


ఇక 'భీమవరం'లో రాధేశ్యామ్ థీమ్ పార్క్ ను ఏర్పాటు చేశారు. సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలతో కూడిన దృశ్యాలతో ఈ థీమ్ పార్క్ ని వారు సెట్ చేశారు. ఇక ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ప్రసారం కానుందనే విషయాన్ని జనంలోకి తీసుకుని వెళ్లడానికి ఒక కొత్త మార్గాన్ని కూడా ఎంచుకున్నారు.'రాధేశ్యామ్' అనేది భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా. బలమైన కథాకథనాలు లేకపోవడం ఇంకా పాటల్లో పస లేకపోవడం వలన ఆ సినిమా దెబ్బతింది.ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆ ఓటీటీ సౌకర్యం అందుబాటులో లేనివారు టీవీలో చూసే అవకాశం ఉంది. టీవీలో చూడవలసి వచ్చేసరికి ఫ్లాపు ఇంకా హిట్ అనే విషయాలను ఆడియన్స్ ఎక్కువగా పట్టించుకోరు. ఇక ఫలానా ఛానల్ లో ఫలానా రోజున రానుందనే విషయం గుర్తుండాలంటే ఇలాంటి ప్రచారాలు చెయ్యడం తప్పనిసరి.మరి ఛానల్ రేటింగును ఈ సినిమా ఎంతవరకూ పెంచుతుందనేది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: