తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా.. ఇక రచ్చ రచ్చే..!

Anilkumar
ఇటీవల ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో తన తర్వాత సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. నిజానికి ముందు నుంచి కూడా సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అలాగే హిందీలో ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమాలు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయి అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఇతర భాషలలో సినిమాలు తెరకెక్కిస్తున్న అగ్ర దర్శకులు నిర్మాతలు ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు భారీ యాక్షన్ కథలను సిద్ధం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ ని కలుస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే గత ఏడాది తమిళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ కుమార్ ఎన్టీఆర్ కోసం ఒక కథ రెడీ చేసుకొని ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అట్లీ కుమార్ బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కి కథ ను వినిపించబోతున్నాడట. అంతేకాదు తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ చెప్పినట్లు.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. లోకేష్ కనకరాజు బ్యాక్ బ్యాక్ హిట్స్ అందుకోవడంతో ఎన్టీఆర్ లోకేష్ కనకరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఇదే క్రమంలో ఎన్టీఆర్ మరో తమిళ క్రేజీ డైరెక్టర్ వెట్రిమారన్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది ఉప్పెన చిత్రంతో భారీ హిట్ అందుకున్న బుజ్జి బాబు ఎన్టీఆర్ కోసం ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా 30, 31 వ సినిమాలను ప్రకటించాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక బుచ్చిబాబు సినిమా ఆ తర్వాతే మిగతా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. కాబట్టి లోకేష్ కనకరాజు అయినా వెట్రిమారన్ అయినా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ సెట్ కావాలంటే కనీసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో విపరీతంగా చెక్కర్లు కొడుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: