స్టార్ హీరోలను మించి అరుదైన రికార్డు సృష్టించిన నాని..!!

Divya
నిజానికి తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇక్కడ ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా అక్కడ భారీ వసూళ్లను రాబడుతూ అరుదైన రికార్డులు సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాతలు ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ ను కీలకంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ప్రేక్షకులను మెప్పించే హీరోలలో సౌత్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు అగ్రస్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు తన కెరీర్ లో అత్యధికంగా 11 సినిమాలు వన్ మిలియన్ డాలర్ కు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. ఇక ఫ్లాప్ టాక్ తో కూడా ఈజీగా మిలియన్ మార్క్ ను అధిగమించారు అంటే అక్కడ మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మహేష్ బాబు తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఓవర్సీస్లో 7 సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను దాటేసి ఎన్టీఆర్ రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇక ఈ జాబితాలోనే ప్రభాస్,  పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్,  అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ అధిగమించి అమెరికా లో సత్తా చాటిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం నాచురల్ స్టార్ నాని అని చెప్పాలి. ఇక నాని తన కెరీర్లో ఇప్పటి వరకు ఆరు సినిమాలు యూఎస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరుకోగా.. ఇప్పుడు తాజాగా అంటే సుందరానికి సినిమా కూడా అమెరికా మార్కెట్లో వన్ మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది.
ఈ నేపథ్యంలోనే మిలియన్ మార్క్ సాధించిన హీరోల లిస్టులో ఎన్టీఆర్ సరసన చేరాడు నాచురల్ స్టార్ నాని. మొత్తానికి అయితే యూఎస్ లో తన మార్కెట్ ను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: