లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న అడవి శేష్.. అసలు ఏమైందంటే..?

Divya
విభిన్నమైన పాత్రలతో .. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఎప్పటికప్పుడు సరికొత్త గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్న హీరోలలో అడవి శేష్ కూడా ఒకరు . ఇక తాజాగా మేజర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు . ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు  కూడా భారీ లాభాలను అందించింది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా అడవిశేష్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరు కాగా .. ఇక ఈ షోలో సందడి చేసి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఇక అన్ని  ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం  మనం చూడవచ్చు.
మేజర్ సినిమా గురించి,  సక్సెస్ గురించి అడవి శేష్ మాట్లాడుతూ తెలుగోడు అక్కడికి వెళ్లి విజయం సాధించాడని చెబుతుంటే తనకు చాలా గర్వంగా ఉందని వెల్లడించారు.ఒక  సినిమాతో హీరోగా ఎదగడం గురించి ఆయన స్పందిస్తూ నాకు ఓవర్నైట్ స్టార్ స్టేటస్ దక్కడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది అని అయితే ఇది ఎక్కడో చదివాను అని కూడా చెప్పుకొచ్చారు. ఇక అంతే కాదు తన మైండ్లో ఇండియాను గ్లోరిఫై చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని కూడా తెలిపారు
ఇక అంతే కాదు తన లాంగ్వేజ్ ను అందరూ కామెడీ చేస్తున్నారని గమనించిన ఆయన,  తనను తాను మార్చుకున్నాను అని కూడా తెలిపారు. ఇకపోతే మేజర్ సందీప్ గారికి పెద్ద అభిమానిని అని తెలిపిన అడివి శేష్ మేజర్ సందీప్ తల్లిదండ్రులకు తాను సెకండ్ కొడుకును అని కూడా చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి గురించి ప్రస్తావిస్తూ అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు చెబుతున్నారు అని , ఆయన స్పష్టం చేశారు.  అయితే ఈ వయసులో తాను లవ్ లో దెబ్బతిన్నానని, తనది లవ్ ఫెయిల్యూర్ అని కూడా తెలిపాడు. ఇక తన పుట్టిన రోజు నాడే తాను ప్రేమించిన అమ్మాయికి వివాహం అయ్యింది అని,  ఇక అంతటి బ్యాడ్ సిచువేషన్ తాను ఎప్పుడూ అనుభవించలేదు అని అందుకే ఇక లవ్ పై నమ్మకం పోయింది అని కూడా తెలిపాడు అడవిశేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: