అయ్యో పాపం..అనసూయ పరువు అడ్డంగా పాయే..

Satvika
బుల్లి తెరపై సక్సెస్ గా రన్ అవుతున్న ఏకైక షో జబర్దస్త్..ఈ షో లో యాంకర్ అనసూయ అందాలకు కొదవ లేదు. కుర్ర యాంకర్లకు ఎ మాత్రం తీసిపొని విధంగా  విధంగా వుంటుంది.అందుకే రోజు రోజుకు ఈ అమ్మడుకు క్రేజ్ పెరుగుతుంది.అనసూయ పొట్టి బట్టలు ధరిస్తే చర్చే.. నిండైన వస్త్రాల్లో అందంగా కనిపించినా చర్చే..మొన్న షేర్ చేసిన ఫోటో షూట్లు కాస్త తేడా కొట్టడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసి పడేశారు. ముసల్దానిలా అవుతున్నావ్ అంటూ.. ఓల్డ్‌గా కనిపిస్తున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్లతో నానా హంగామా చేశారు. అలా అనసూయ అందం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

 
అలా అనసూయ అందం మీద జబర్దస్త్ షోలో ప్రశంసలు, సెటైర్లు రెండూ పడుతుంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ చలాకి చంటి అనసూయ అందం గురించి సెటైర్ వేశాడు.రోజురోజుకీ అందం పెరుగుతోంది అంటూ ఓ మూలిక అడిగిందట. దాంతో అనసూయ తెగ మురిసిపోతుంది. కానీ అంతలోనే చంటి ఓ సెటైర్ వేస్తాడు. ఆమెకు ఓ మూలిక ఇచ్చాను.. దీంతో ఆమె అందం రోజురోజుకీ పెరుగుతోంది అనే భ్రమ తగ్గిపోయిందంటూ పరువుతీసేశాడు. ఇక ఆ పంచ్‌తో అనసూయ మొహం మాడిదపోయినట్టుంది. కానీ అనసూయ మాత్రం తన అందాన్ని మెయింటైన్ చేసేందుకు చాలానే కష్టపడుతోంది. వర్కవుట్లు, యోగాలు అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆదివారం నాడు కూడా అనసూయ జిమ్‌కు రెస్ట్ ఇవ్వదు..


ఎప్పుడూ ఖాళీ సమయం దొరికినా కూడా ఆలస్యం చెయ్యకుండా జిమ్ లో గడిపెస్తుంది..తన భర్తతో కలిసి అనసూయ జిమ్‌లో సందడి చేస్తుంటుంది. అలా అనసూయ తన ఫిజిక్‌ను కాపాడుకునేందుకు బాగానే ప్రయత్నిస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు తన లుక్‌ను మార్చుకుంటుంటుంది. అనసూయ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారుతోంది. అనసూయ చివరగా ఖిలాడీ సినిమాలో కనిపించింది. అందులో రెండు గెటప్పులో కనిపించి మెప్పించింది. ఇక దర్జా సినిమాతో మరోసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనసూయ కనిపించబోతోంది. కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ అనసూయ ఎంట్రీ ఇచ్చేసింది...మొత్తానికి మన యాంకరమ్మా మంచి స్పీడ్ మీద ఉందని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: