ప్రభాస్ ను అలా చూపిస్తా అంటున్న మారుతి..?

Anilkumar
ప్రస్తుతం దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. కాగా ఇటివల రాధేశ్యామ్ ప్రమోషన్స్లో మారుతి సినిమా గురించి తొలిసారి ప్రభాస్ వెల్లడించారు.అయితే ఈ సినిమా కథతో పాటు హీరోయిన్లకు సంబంధించి చాలా రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీటిపై దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు.ఇదిలావుండగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఫుల్ బిజీగా ఉంది. కాగా మరో రెండేళ్ల వరకు అతడి డేట్స్ సర్దుబాటు కావడం కష్టమే. ఇకపోతే పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్. ఇక ఈ బిజీ షెడ్యూల్లోనే దర్శకుడు మారుతితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.

అయితే  రాధేశ్యామ్ ప్రమోషన్స్లో మారుతితో సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.అంతేకాదు  ప్రభాస్- మారుతి సినిమాకు సంబంధించి పలు వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.అయితే హారర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక  ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు, ఈ క్యారెక్టర్స్ కోసం మాళవికా మోహనన్, శ్రీలీలతో పాటు మరో నాయికను ఎంపికచేశారని ఊహాగానాలు వినిపించాయి.ఇకపోతే  వీటిపై ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్లో ప్రభాస్తో సినిమాపై స్పష్టత నిచ్చారు.

కాగా  ఈ సినిమా కథ, హీరోయిన్ల విషయంలో వినిపిస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తెలిపారు.ఇక  హీరోయిన్లు ఎవరిని ఫైనల్ చేయలేదని అన్నారు.అయితే పర్సనల్గా తాను ప్రభాస్ ఫ్యాన్నని, అతడిని అమితంగా అభిమానిస్తానని మారుతి తెలిపారు.కాగా  ఫ్యాన్స్ అందరిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రభాస్తో పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతకాక  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాల్ని వెల్లడిస్తానని మారుతి అన్నారు.ఇకపోతే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే మారుతి దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక  ఇందులో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. ఇదిలావుంటే మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్తో 'సలార్' సినిమా చేస్తున్నారు. అంతేకాక అలాగే నాగ్అశ్విన్ 'ప్రాజెక్ట్ కే'తో పాటు 'ఆదిపురుష్' సినిమాల్లోనూ నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: