స్టార్ మా లో సుధీర్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?

Anilkumar
సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మనందరికీ తెలిసిందే. ఈ పేరు కనిపించింది అంటే చాలు ఆ వార్త వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే  జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్.మొదట్లో  ఈయన ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీం లీడర్ గా మారి.. తరువాత జబర్దస్త్ కే ఓకే ఒకడిగా టాప్ టీం లీడర్ గా ఎదిగాడు. సుధీర్ పంచులు వేయడం కాదు తీసుకోవడంలోనూ మజా ఉంది అని నిరూపించుకున్నాడు.అంతేకాక ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

అయితే  తాజాగా  ఏమైందో జబర్దస్త్ నుండి తప్పుకుని.. ఇప్పుడు మరో ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు సుడిగాలి సుదీర్. అయితే సుధీర్ ఎందుకు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అన్న చర్చ గత కొంత కాలం నుంచి జరుగుతూనే ఉంది.అంతేకాదు జబర్దస్త్ కు ఎంతో సేవ చేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ విషయంలో జబర్దస్త్ నిర్వాహకులతో డీల్ కుదరక బయటికి వచ్చేశాడు అన్న టాక్ కూడా వినిపించింది.ఇదిలావుండగా  ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో సూపర్ సింగర్ జూనియర్ ప్రోగ్రాం కి అనసూయ తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే  ఈ షో లో సుధీర్ పారితోషికం ఎంత అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇకపోతే గతంలో యాంకర్ అనసూయ కంటే సుధీర్ టీం లీడర్ గా పారితోషికం తక్కువగానే తీసుకున్నాడు.అయితే ఈ విషయం లోనే జబర్దస్త్ నిర్వాహకులతో సుధీర్ కి మధ్య చిన్న వివాదం తలెత్తిందట.తాజగా ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో మాత్రం సుధీర్ కి పారితోషికం బాగానే ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఇకపోతే  ఈ క్రమంలోనే మరికొన్ని ఛానల్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు సుడిగాలి సుదీర్.అయితే  త్వరలో కామెడీ స్టార్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా స్టార్ మా లో యాంకర్ గా ప్రత్యక్షమవ్వగా ఇక ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నాడట సుడిగాలి సుదీర్.ఇక  ఇది జబర్దస్త్ లో ఇచ్చే దానికంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. అయితే  ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: