బాలకృష్ణ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ విడుదల ఎప్పుడో తెలుసా..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న మాస్ దర్శకులలో ఒకరు అయినా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న   మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమా బాలకృష్ణ కు కెరియర్ పరంగా 107 వ సినిమా . ఈ మూవీ లో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక  పాత్రలో కనిపించబోతోంది .  

దునియా విజయ్ ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు . ఈ సినిమాలో బాలకృష్ణ 50 సంవత్సరాల వయస్సు వ్యక్తిగా కనిపించ బోతున్నట్లు, ఈ మూవీ ని దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో తెరకెక్కించనున్నట్లు , ఈ మూవీ లో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల కనిపించనున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్క బోయే సినిమా  రెగ్యులర్ షూటింగ్  జూలై నుండి ప్రారంభం కాబోతున్న తెలుస్తోంది . జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను థియేటర్ లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళిక లను వేసుకున్నట్లు తెలుస్తోం ది .

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి కామెడీ సినిమాలను తెరకెక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడి గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు . బాలకృష్ణ తో మాత్రం కామెడీ సినిమాను తెరకెక్కించాను అని అనేక ఇంటర్వ్యూ లలో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పు కొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: