'నిర్మాత అల్లు అరవింద్ - డైరెక్టర్ రాజమౌళి' మధ్యన విభేదాలకు కారణం అదేనా?

VAMSI
సినీ రంగం లో దర్శక నిర్మాతల మద్య సంబంధం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఒకరు సినిమాలను చిత్రీకరిస్తే మరొకరు సినిమాలకు మూలమైన బడ్జెట్ అందిస్తూ కీలక పాత్రా వహిస్తారు. సో అలా దర్శక నిర్మాతల మద్య సఖ్యత అనేది అవసరం. అయితే మంది ఉన్నచోటే మంట అని... కలిసి పనిచేసే చోట ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో మనస్పర్ధలు వస్తాయి. బడ్జెట్ విషయం లోనో, కాస్టింగ్ విషయం లోనో మరేదైనా అంశం లోనో విభేదాలు వస్తుంటాయి. ఇలాంటివి సినీ పరిశ్రమలో చాలానే చూసాం. అయితే తాజాగా మరొక విషయం వైరల్ అవుతూ ఉంది.
ఇలా ఇండస్ట్రీలో పలువురు దర్శక నిర్మాతల మద్య విభేదాలు వచ్చి దూరంగా ఉంటారు. వారి కాంబోలో సినిమా అంటే ఇక గగనమే. ఇదే తరహాలో దర్శక ధీరుడు రాజమౌళి, అలాగే ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ మద్య పలు విభేదాలు రావడంతో వీరు కలిసి ప్రాజెక్టు లు చేయడం లేదని చాలా వార్తలే ప్రచారంలో ఉన్నాయి. అయితే అసలు వీరి మద్య ఉన్న మనస్పర్ధలు నిజమేనా ? ఎందుకు ? ఏమిటి ? అన్న విషయానికి వస్తే ఇవే కారణమని ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం.  
మగధీర చిత్రం సమయం లోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి అన్నది ఎక్కువగా వినిపిస్తున్న విషయం. మెగా హీరో రామ్ చరణ్ కి, దర్శకుడు రాజమౌళి కి ఈ సినిమానే ఎంట్రీ మార్క్ అని చెప్పొచ్చు అయితే... ఈ సినిమా షూటింగ్ సమయం లో జక్కన్న తను చెప్పిందల్లా వినాలని నిర్మాత అల్లు అరవింద్, అయితే తనని స్వేచ్చగా వదిలేస్తేనే రిజల్ట్ అనుకున్నట్లు వస్తుందని జక్కన్న ఇలా ఇద్దరి మధ్య చాలా మనస్పర్థలు వచ్చాయట. అలా ఆ గ్యాప్ సినిమా షూటింగ్ ప్రారంభం నుండి చివరి వరకు కొనసాగుతూనే వచ్చిందని దాంతో ఇద్దరి మద్య చాలా విభేదాలు తలెత్తాయి అని అంటుంటారు. అందుకనే ఆ సినిమా తరవాత వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయలేదని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: