'ఢీ' షోలో ఇలాంటి డాన్సా.. కోపంతో వెళ్ళిపోయిన జానీ మాస్టర్?

praveen
ప్రస్తుతం సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో ఏది అంటే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో అని చెబుతారు ప్రతి ఒక్కరు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఎన్నో సక్సెస్ ఫుల్ గా ఢీ షో నడుస్తుంది అని చెప్పాలి. ఇక ప్రతి సీజన్ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.అయితే ఓకే 'ఢీ' అనగానే కేవలం డ్యాన్సులు మాత్రమే గుర్తుకు వచ్చేవి.  కానీ ఇప్పుడు మాత్రం కామెడీ షోలకు మించిన ఎంటర్టైన్మెంట్ సైతం 'ఢీ' షో లో ఉంది. అందుకే ఈ కార్యక్రమం వస్తుంది అంటే చాలు  ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు.

 ఇక ప్రతి వారం కూడా సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కంటెస్టెంట్ లు ఎప్పుడూ  అదరగొడుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో మంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా ఒకప్పుడు 'ఢీ' కంటస్టెంట్స్ కావడం గమనార్హం. అయితే ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన  ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడి గా సాగిపోయింది.

 అయితే ఈ ప్రోమోలో భాగంగా జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ కొంతమంది కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. 'ఢీ' షో అంటే ఎంతో పవర్ ఫుల్ షో అని.. అలాంటి షో లో ఇలాంటి డాన్స్ చేయడం ఏంటి అంటూ కోపగించు కున్నాడు. మీ పర్ఫామెన్స్ మీ కొరియోగ్రఫీ ఏది నాకు నచ్చలేదు. మీరు ఫ్యూచర్ లో అయినా బాగా చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇలాగే చేస్తే నేను ఇక్కడికి  ఇంకోసారి రావాలని అనుకోవట్లేదు అంటూ కోపంతో తన సీట్లో నుంచి లేచి వెళ్లిపోయాడు జానీ మాస్టర్. ఇక ఈ ప్రోమోలో ఇది చూసిన తర్వాత జానీ మాస్టర్ ని అంతలా అసంతృప్తికి గురి చేసిన డాన్స్ ఏంటి అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఆసక్తి  కూడా పెరిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: