దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేయకపోవడానికి కారణం తెలుసా?

VAMSI
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలలో చిన్నపిల్లాడిని అడిగినా దేవి గురించి గడగడ చెప్పేస్తారు. అంతగా ఈయన మ్యూజిక్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజల్లోకి వెళుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందించారు అంటే ఇక ఆ పాట ప్రతి నోట పలకాల్సిందే అంత అద్భుతంగా సంగీతాన్ని అందించడం దేవి ప్రత్యేకత. చిన్న వయసులోనే సంగీత ప్రపంచం లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. అయితే అప్పుడప్పుడు ఈ సంగీత దర్శకుడు పాటల మద్యలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం అందరూ చూసే ఉంటారు. మంచి మ్యూజిక్ డైరెక్ట్ర్ మాత్రమే కాదు. ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ దేవి శ్రీ లోనూ ఉన్నాయి.
అయితే వెండి తెరపై దేవి ని చూసిన చాలా మంది ఇదే మాట అన్నారట. కొందరు దర్శకులు సైతం మీకు హీరోగా ఛాన్స్ ఇస్తాం అని అన్నారట. అయితే అవకాశం పాపులారిటీ అన్ని ఉండి కూడా దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేయలేదు. అయితే అందుకు ఒక కారణం ఉందని ఇండస్ట్రీలో అంటుంటారు. అదేమిటంటే  వన్స్ హీరోగా అడుగు పెట్టాక అక్కడ క్లిక్ అవకపోతే వెనుదిరగాల్సి ఉంటుంది. అయితే అలా వెనకడుగు వేయడం అనేది దేవి శ్రీ ప్రసాద్ కు అస్సలు నచ్చదట. అంతే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పీక్స్ లో  కొనసాగుతున్న సమయంలో ప్రయోగాలు చేస్తే కెరియర్ దెబ్బతింటుంది అన్న ఆలోచన కూడా ఒక కారణం అని అంటుంటారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరి పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికీ ఇండస్ట్రీలో  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లోనే ఉన్నారు. అయిపోతే ఈ మధ్యన మాత్రం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ నుండి కాస్త పోటీ ఎదురవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: