రాత్రి నిద్రపోకుండా ఆ పని చేస్తున్న దీపిక పిల్లి...!!

murali krishna
బుల్లితెరపై దీపిక పిల్లికి ఉన్న క్రేజ్ అందరికీ కూడా తెలిసిందే. ఒకప్పుడు టిక్ టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌తో దీపిక పిల్లి బాగా ఫేమస్ అయ్యింది.అక్కడ వీడియోలు చేసి ఎంతో ఫేమస్ అయింది.


డ్యాన్సులు, యాక్టింగ్ చేస్తూ టిక్ టాక్‌లో ఫేమస్ అయిన దీపిక పిల్లికి బుల్లితెరపై కూడా చాన్స్ వచ్చింది. మొత్తానికి దీపిక పిల్లి మాత్రం బుల్లితెరపై స్టార్‌ యాంకర్ గా మారింది. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వారిని మల్లెమాల తన టీంలోకి తీసుకుందట.. అలా టిక్ టాక్ భాను, దీపిక పిల్లి వంటి వారు బుల్లితెరపైకి వచ్చారు. ఢీ షోతో దీపిక పిల్లి బుల్లితెరపైనా కనిపించింది. కానీ ఆమెకు అంత అయితే గుర్తింపు రాలేదు.


అక్కడ ఆదికి, దీపిక పిల్లికి ట్రాక్ వర్కవుట్ చేద్దామని కూడా ప్రయత్నించారు.కానీ వచ్చిన మొదటి రోజే.. దీపిక పిల్లి.. నీ చెల్లి అని అనేసింది. దీంతో ఆ ట్రాక్ మీద మొదటి నుంచి ఆసక్తి లేకుండా పోయిందట.అలా దీపిక పిల్లి ఢీ షోలో ఎలాంటి చమక్కలు లేకుండా పోయింది. ఆ షోతో దీపిక పిల్లికి ఎలాంటి క్రేజ్ కూడా రాలేదు. కానీ ఢీ షోలో యాంకర్ రష్మీతో దీపిక పిల్లికి మంచి స్నేహం అయితే ఏర్పడింది. ఈ ఇద్దరూ సిస్టర్స్‌లా కలిసిపోయారు. పిల్లి చెల్లి అంటూ దీపికను రష్మీ పిలుస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి వీకెండ్ పార్టీలంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. రష్మీ ఇంట్లో కూడా దీపిక ఎక్కువగా ఉంటుంది.


ఇక రష్మీ ఇన్ స్పిరేషన్‌తో పెట్స్ లవర్‌గా దీపిక పిల్లి మారిపోయిందట.. రష్మీ ఇంట్లో ఉండే పెట్ చుట్కీతో దీపిక పిల్లి ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. అలా దీపిక పిల్లి, రష్మీ ఇద్దరూ కలిసి మంచి స్నేహితులుగా మారిపోయారట.. అక్కా అంటూ రష్మీ వెనకాల దీపిక తెగ తిరుగుతుంటుంది. అయితే రష్మీ, దీపిక ఇద్దరూ కలిసి చేసే సందడి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుందట.. రష్మీతో దీపిక నౌట్ అవుట్లు చేస్తుంటుందట.. తాజాగా దీపిక నిన్న రాత్రి నిద్రపోనట్టు కనిపిస్తోంది. అర్దరాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు దీపిక పిల్లి పుస్తకాలు పట్టుకుని చదువతూనే ఉన్నట్టు కనిపిస్తోందట.. మూడు గంటల సమయంలోనూ తాను చదువుతున్నట్టు చెప్పుకొచ్చిందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: