"అంటే సుందరానికి" హీరోయిన్ నజ్రియాకు వరుస ఆఫర్ లు ?

VAMSI
'అంటే సుందరానికి' మూవీ నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతోంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా ఒక కామెడీ యాంగిల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ సినిమాలో నానికి జంటగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఈమెను ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి రాక మానదు. అట్లీ డైరెక్షన్ వహించిన రాజు రాణి చిత్రం ఒక మంచి ప్రేమకథగా వచ్చి అందరినీ థ్రిల్ చేసింది. ఇందులో రెండు జంటలా ప్రేమకథలు మనము చూడవచ్చు. ఇందులో ఆర్యకు లవర్ గా నజ్రియా నజీమ్ నటించి ప్రేమికుల కంట కన్నీరు తెప్పించింది .
ఇందులో తన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. ఆ తర్వాత ఈమె నటించిన తెలుగు సినిమా ఇదే. ఇందులో ఒక క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయిగా నటించి మెప్పించింది. సినిమాలో అక్కడక్కడ స్లోగా ఉన్నా ఓవరాల్ గా నాని మరియు నజ్రియా ల నటనతో గట్టెక్కిందని చెప్పాలి.  ఇందులో తన నటన చూస్తే... తెలుగులో కొంతకాలం హీరోయిన్ గా నిలదొక్కొకోగలదు అనే నమ్మకం వచ్చింది. అయితే ఈమెకు ఎమోషనల్ సినిమాలలో బాగా నటించ గలిగే సత్తా ఉంది. కాబట్టి... టాలీవుడ్ దర్శకులు ఈమెను అలంటి పాత్రలకు ఎంచుకోవచ్చు. మరి ముందు ముందు ఇంకెన్ని తెలుగు సినిమాలలో నటిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అప్పుడే రెండు సినిమాలకు సైన్ చేసిందట. అందులో ఒక సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది అని తెలుస్తోంది. ఇక మరో సినిమా ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: