కిరణ్ అబ్బవరం స్పీడ్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును  తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం  ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్'  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ హీరోకు బాక్సాఫీస్ దగ్గర నిరాశను మిగిల్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్  లో ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చు కున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్  షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: