ఇమ్మానుయేల్ తో రిలేషన్ పై నోరు విప్పిన వర్ష.. మా మధ్య ఉంది అదే అంటూ..!

Anilkumar
బుల్లితెర షో అయిన జబర్దస్త్ కార్యక్రమం గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ షో  ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ రష్మీ జంట ఒకటి. ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.ప్రేక్షకుల్లో  వీరికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలలో ఈ జంటతో డాన్స్ పర్ఫార్మెన్స్ లో చేయించడం లేదా వీరికి పెళ్లి చేయడం వంటి కార్యక్రమాలతో ఈ షో రేటింగ్స్ బాగా  పెంచుకుంటున్నారు.అయితే ఈరకంగా సుడిగాలి సుధీర్ రష్మీ జంట కు పోటీగా ఇప్పుడు ఇమ్మానుయేల్, వర్ష జంట కూడా ఒకటి.

అయితే వీళ్ళిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఈ జంట చేసే స్కిట్ లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.వీరిద్దరి ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని జబర్దస్త్ వాళ్ళు ఎన్నోసార్లు వేదికపై వీరిద్దరికి వివాహం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ క్రమంలోనే ఈ జంట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. దీనితోపాటు వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని,ఈ జంట ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం  ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వర్ష ఇమ్మానియేల్ తో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.వర్ష మాట్లాడుతూ.... ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేను, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి అనేది మాత్రం చెప్పలేక పోతున్నాను అంటూ వెల్లడించారు. అంతేకాదు మా ఇద్దరిదీ ఓ బాండింగ్ అంతే స్కిట్ వరకు మా బాండింగ్ ఎలా ఉంటుందో,స్కిట్ తర్వాత కూడా అలాగే ఉంటుందని, ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో చెప్పలేను అంటూ ఈ సందర్భంగా ఇమ్మానియేల్ తో తనకు ఉన్న రిలేషన్ గురించి ఈ సందర్భంగా వర్ష క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: