పక్కా కమర్షియల్ నుంచి టైలర్ గ్లింప్స్ రెడీ..

Satvika
సీనియర్ హీరో గొపిచంద్ నటిస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్..డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్'లో భాగంగా పాటలను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అది అలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గించబోతున్నట్టు తెలిపారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు.

 
తమ సినిమా 'పక్కా కమర్షియల్‌' టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రేట్స్ ఎలా ఉంటాయో కూడా ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగా చూస్తె.. నైజాం (తెలంగాణ) మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయి..ఇటీవల విడుదల అయిన పెద్ద సినిమాల కారణంగా ఈ సినిమాకు టిక్కెట్ రేట్లను తగ్గించినట్లు సమాచారం.ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మధ్యలో 'మంచి రోజులొచ్చాయి' సినిమాతో పలకరించాడు.

 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది.ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది..ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ ను ఈరోజుసాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చెప్పారు..ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: