ఆన్ స్టాపబుల్ -2 వచ్చేది అప్పుడే..!!

Divya
నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆన్ స్టాపబుల్ లో పాల్గొన్నారు ఈ సీజన్ మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ షో ని అహ లో ప్రారంభించారు అల్లు అరవింద్. దీంతో బాలయ్య అభిమానులు సైతం చాలా ఆనందంగా ఉన్నారు. ఇక దీంతో తాజాగా ఆన్ స్టాపబుల్-2 ప్రచారం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ మొదటి భాగం అయిపోయి ఇప్పటికి పది నెలలు అవుతోంది. గత ఏడాది అక్టోబర్లో మొదటి భాగం ప్రారంభమైంది.

అయితే ఈ ఏడాది చివర్ లో కల్లా ఆన్ స్టాపబుల్-2 ప్రారంభం అవబోతుంది అని ప్రచారం జరుగుతోంది. అయితే నందమూరి అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా సమాచారం ప్రకారం ఆన్ స్టాపబుల్ -2 ఎప్పుడు మొదలవుతుందో అంటూ చర్చలు మొదలు పెట్టారు. కనీసం ఒక ఏడాది ఆయన గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేస్తే.. మొదటికే మోసం వస్తుందని తెలియజేస్తున్నారు. అందుచేతనే ఈ సీజన్ న కాస్త స్లో గా మొదలు పెడితే బాగుంటుందని ఉద్దేశంతో అహ టీమ్ ఉన్నట్టుగా సమాచారం.ఆన్ స్టాపబుల్ షో ప్రారంభం కానున్న అప్పటికీ అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ లు కూడా కొనసాగుతూ ఉండడం గమనార్హం
బాలకృష్ణ గెస్ట్లుగా ఎవరిని కూర్చోబెట్టాలి వారిని ఎలా ప్రశ్నలు వేయాలి అనే వాటిపైన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అహ లో ఆన్ స్టాపబుల్ -2 సీజన్ మొదలవ్వడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్నది. ఈ లోపు బాలకృష్ణ తన 107 వ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక మరొక వైపు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు వెండి తెర పైన చూసిన బాలయ్యను ఆ హోటల్లో చూస్తూ సరికొత్తగా అనిపిస్తోందంటు సంబరపడిపోతున్నారు. ఇక మరెన్ని సీజన్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: