పూర్ణ కాబోయే భర్తకు.. కాజల్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

Anilkumar
టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి పూర్ణ. రవిబాబు దర్శకత్వంలో అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె అనుకున్నంత స్థాయిలో హీరోయిన్గా రాణించలేకపోయింది. దీంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చేసింది. ఢీ షో పుణ్యమా అంటూ జడ్జిగా చేస్తూనే సినిమాల్లో మంచి అవకాశాలు సైతం కొట్టేస్తుంది.అప్పుడప్పుడు పలు ఈవెంట్స్ లోనూ హాట్ పర్ఫామెన్స్ వచ్చి తన లో నటనా టాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తోంది. ఇక ఇటీవల పూర్ణ అఖండ, దృశ్యం2,తలైవి వంటి సినిమాల్లో  కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. 

కాగా తాజాగా ఈ అమ్మడు పెళ్లి ఫిక్స్ అయిందని తన కాబోయే భర్త ఇతనే అంటూ ఓ పోస్ట్ చేస్తూ అఫిషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పూర్ణ పెళ్లి చేసుకోబోతున్న అతని పేరు ఆసిఫ్ అలీ. అతను ఓ ప్రముఖ బిజినెస్ మాన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ సీఈవో. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అని తెలుస్తోంది. అంతేకాదు అసిఫ్ అలీ యూఏఈ బిజినెస్ మాన్ కూడా. అలాగే సినీ ప్రముఖుల అందరికీ ఆయన యూఏఈ వీసా లను సైతం అందిస్తుంటాడు. ఇప్పటికే సౌత్ బడా హీరోయిన్స్ కాజల్, ప్రియమణి, ఆండ్రియా, లక్ష్మీరాయ్, విజయ్ సేతుపతి, శ్వేతా మీనన్ వంటి సెలబ్రిటీలకు ఇతను వీసాలు అందించారు.

అప్పుడు ఆయన్ని  పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హీరోయిన్ పూర్ణ ఇతన్ని పెళ్లాడబోతోందని తెలియడంతోనే మన తెలుగు వాళ్ళు ఈయన గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కేరళ సీఎం నుండి ఎన్ఆర్ఐ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా అవార్డు కూడా అందుకున్న ఇతను సెలెబ్రిటీ లైఫ్లో గడుపుతున్నాడు.అటు ముస్లిం మత పెద్దలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని అలాగే సోషల్ మీడియాలో అతనికి భారీ ఫాలోయింగ్ ఉందని అంటున్నారు. మొత్తానికి మన హీరోయిన్ పూర్ణ భారీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తినే పెళ్లాడబోతోందన్న మాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: