వామ్మో.. వెంకటేష్ ఆస్తి అన్ని కొట్లా?

Purushottham Vinay
సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తండ్రి సహాయంతో అడుగుపెట్టాడు. ఇక మొదటి సినిమాతోనే డెబ్యూ హీరోగా అవార్డును కూడా సొంతం చేసుకున్న వెంకటేష్ ఇక ఆ తర్వాత వరుస ఫ్యామిలీ సినిమాలు కూడా చేస్తూ మరొక వైపు మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇకపోతే తన సినిమాలలో తానే కామెడీని పండిస్తూ ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకున్న వెంకటేష్ ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ మంచి ఫామ్లో దూసుకుపోతున్నాడు.ఇకపోతే తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన f3 సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. ఇక మొదటి షో తోనే మంచి రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం. ఇకపోతే మంచి సక్సెస్ ను అందుకున్న వెంకటేష్ కు సంబంధించి ఒక వార్త కూడా బాగా వైరల్ గా మారుతోంది.ఇక అదేమిటంటే ఆయన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి ని బిజినెస్ ద్వారా సంపాదించిన ఆస్తి ని పక్కన పెడితే తన తండ్రి నుంచి వారసత్వంగా ఎన్ని వేల కోట్లు అందుకున్నాడు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.


ఈ విషయం తెలుసుకునే ముందు వెంకటేష్ తన సొంత ప్రతిభతో ఎంత ఆస్తిని కూడబెట్టాడు అనే విషయం తెలుసుకుందాం.విక్టరీ వెంకటేష్ సినిమాలలో నటిస్తూనే మరొక వైపు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చూపిస్తున్నారు. ఇక సుమారుగా 35 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన హైదరాబాదులో తన ఇంటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా మతిపోవాల్సిందే . ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆ ఇంటిలో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక తన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి వెంకటేష్ బాగా దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. మొత్తంగా రూ.2,300 కోట్ల దాకా ఈయన ఆస్తి ఉంటుందని సమాచారం. ఇక తండ్రి రామానాయుడు నుండి వారసత్వంగా ఆయన రూ.5000 వేల కోట్ల రూపాయల వరకు ఆస్తి లభించింది అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే రూ.7, 300 కోట్ల రూపాయల ఆస్తికి వెంకటేష్ వారసుడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: